కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు షేక్ హ్యాండ్ ఇవ్వద్దు. కేవలం నమస్తే చెబితే చాలు. ఇదే ఆరోగ్య సూత్రం అన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీలు.. ఆ రూల్‌ను పక్కనపెట్టేశారు. ఆ ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. బీజింగ్‌లో సమావేశమైన నేతలు మీడియా ముందు ఇలా ఫోజు ఇచ్చారు. కొన్ని శక్తులు మనల్ని వేరు చేసేందుకు షేక్‌హ్యాండ్ ఇవ్వొద్దు అన్న నియమాన్ని పాటిస్తున్నాయని, కానీ వాళ్లు ఆ విషయంలో సక్సెస్ కాలేరని పాక్ అధ్యక్షుడు అల్వీ అన్నారు. విజృంభిస్తున్న కరోనాను చైనా పద్ధతి ప్రకారం అదుపులోకి తీసుకువచ్చిందని అల్వీ కితాబుఇచ్చారు. కరోనాపై తుది విజయం సాధించేందుకు ప్రజలు పోరాటం చేస్తున్నారని జీ జిన్‌పింగ్ అన్నారు.
షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్న పాక్, చైనా దేశాధినేతలు